రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. నాగారం శివారులో సబ్‌స్టేషన్, రెండు అంగన్వాడీ సెంటర్ల భవనాలు, రూ. 39 లక్షల వ్యయంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కరెంటు కష్టాలు అనుభవించా..
ఉమ్మడి పాలనలో తెలంగాణలో కరెంటు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతన్నగా పొలం గట్టుపై కూర్చొని కరెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మళ్లీ అలాంటి పరిస్థితి ఏ రైతుకు తలెత్తలేదని చెప్పారు.