తెలంగాణ

telangana

ETV Bharat / state

'పంట ధరను రైతు నిర్ణయించాలనేదే సీఎం లక్ష్యం' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

ప్రణాళిక లోపం, దళారుల మోసం వల్ల రైతులు బలి అవుతున్నారని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి వెల్లడించారు. కోదాడలో నియంత్రిత సాగు విధానంపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. పంట ధరను నిర్ణయించే శక్తిని రైతుకు కల్పించేందుకే నియంత్రిత సాగు విధానమని పేర్కొన్నారు. కేంద్ర సహకార బ్యాంకు ద్వారా మంజూరైన తొమ్మిది కోట్ల రుణాల బట్వాడా చెక్కులను అన్నదాతలకు అందజేశారు.

'పంట ధరను రైతు నిర్ణయించాలనేదే సీఎం లక్ష్యం'
'పంట ధరను రైతు నిర్ణయించాలనేదే సీఎం లక్ష్యం'

By

Published : May 30, 2020, 4:57 PM IST

ప్రణాళిక లోపం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, దళారుల మోసానికి రైతులు బలవుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు, అధికారులుకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంట ధరను నిర్ణయించే శక్తి రైతుకు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.

ప్రతి క్లస్టర్​లో వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు.. రైతులకు నియంత్రిత సాగు విధానంపై అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. అనంతరం నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా రైతులకు మంజూరైన 9 కోట్ల రుణాల బట్వాడా చెక్కులను అందజేశారు. ప్రతి అన్నదాతకు రైతుబంధు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:జులై వరకు మిడతల ముప్పు తప్పదు!

ABOUT THE AUTHOR

...view details