హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాసను ఓడించడమే ధ్యేయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఎస్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 12శాతం ఉన్న మాదిగ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొప్పుల ఈశ్వర్‌ను ఉపముఖ్యమంత్రి చేస్తే తప్ప... ఎస్సీలు తెరాసకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వద్దంటూ రాజ్యసభకు రాజీనామా చేసిన హరికృష్ణకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన కేసీఆర్... తెలంగాణ ఉద్యమానికి మూలపురుషుడు ఆమోస్‌కు కనీసం సంతాపం తెలపకపోవడం దారుణమన్నారు.
హుజూర్‌నగర్‌లో తెరాసను ఓడించడమే ధ్యేయం: మంద కృష్ణ - manda krishna madiga about huzurnagar election
తెలంగాణలో 12శాతం ఉన్న తమ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తెరాసను ఓడించాలని పిలుపునిచ్చారు.
హుజూర్‌నగర్‌లో తెరాసను ఓడించడమే ధ్యేయం: మంద కృష్ణ