సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్నెమిల గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. చిన్నెమిల సమీపంలోని చాముల్ తండాకు చెందిన బానోతు వత్నం (45) ఇంట్లో కరెంటు షాక్తో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని గ్రామస్థులు తెలిపారు.
Current Shock: కరెంట్ షాక్తో వ్యక్తి మృతి, కన్నీటి సంద్రంలో కుటుంబీకులు - సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా చిన్నెమిల సమీపంలోని చాముల్ తండాలో ఈ ప్రమాదం జరిగింది.
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి, కన్నీటి సంద్రంలో కుటుంబీకులు
బానోతు వత్నం మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబపెద్ద ప్రాణాలు కోల్పోవడం తమను దిక్కుతోచని స్థితిలో పడేసిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!