సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. అడ్డగోలుగా అరుస్తూ.. ఎదురుపడిన వారందరి మీద దాడి చేసింది. పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామస్థులను కరిచిన పిచ్చికుక్కను గ్రామంలోని యువకులు వెంటాడి హతమార్చారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సూర్యాపేటలో పిచ్చికుక్క దాడి.. ఎనిమిది మందికి గాయాలు! - పిచ్చికుక్క స్వైర విహారం
సూర్యాపేట జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఎనిమిది మందిని గాయపరిచింది. కుక్కకాటుతో గాయపడ్డ వారిని స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్సకై తరలించారు. పిచ్చి కుక్కలను నివారించాలని గ్రామస్థులు అధికారులను కోరారు.
సూర్యాపేటలో పిచ్చికుక్క దాడి.. ఎనిమిది మందికి గాయాలు!