ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలు గోదాముల దగ్గర త్వరగా దిగుమతి కాకపోవటం వల్ల సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రైల్వేట్రాక్ పక్కన లారీలు భారీగా నిలిచిపోయాయి. నేడు మేడే కావడం వల్ల దిగుమతిలో జాప్యం జరుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసేందుకు వచ్చిన వాహన డ్రైవర్లు ఎండతో పాటు తాగునీరు, ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కలుగజేసుకొని త్వరగా దిగుమతి అయ్యేలా చూడాలని లారీల యజమానులు, డ్రైవర్లు కోరుతున్నారు.
భారీగా నిలిచిపోయిన లారీలు - maize
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు రైల్వేట్రాక్ పక్కన లారీలు భారీగా నిలిచిపోయాయి. ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలు త్వరగా దిగుమతి కాకపోవటం వల్ల లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కలుగజేసుకుని త్వరగా దిగుమతి అయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.
భారీగా నిలిచిపోయిన లారీలు