సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కాపుగల్లులో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కాపుగల్లు నుంచి రామాపురం గ్రామానికి ఆటోలో మద్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేనందున మద్యం సీసాలను, ఆటోను సీజ్ చేశారు. ఆటో డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మద్యం విలువ దాదాపు రెండు లక్షల 15 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రామాపురంలో మద్యం పంపిణీ చేసేందుకు తీసుకున్నట్లు విచారణలో తేలింది.
రూ. 2 లక్షలు విలువ చేసే మద్యం పట్టివేత - LIQUOR
మూడో విడత ప్రాదేశిక ఎన్నికలు రేపే కావడం వల్ల అభ్యర్థులు ఓటర్లను మభ్యపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మద్యం సీసాలు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజలను ప్రలోభపెట్టడానికి తీసుకెళుతున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
2 లక్షల రూపాయల విలువ చేసే మద్యం పట్టివేత