తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో వామపక్షాల సమ్మె.. నిలిచిపోయిన బస్సులు

దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సార్వత్రిక సమ్మె సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపట్టిన మోటారు వాహనాల చట్టానికి వ్యతిరేకంగా వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ మేరకు సూర్యాపేటలో బస్సులు బస్టాండ్లకే పరిమితమయ్యాయి.

left parties strike in suryapet
సూర్యాపేటలో వామపక్షాల సమ్మె.. నిలిచిపోయిన బస్సులు

By

Published : Nov 26, 2020, 1:19 PM IST

దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సార్వత్రిక సమ్మె సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. సుర్యాపేట మీదుగా వెళ్లే హైదరాబాద్- విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు పాక్షికంగా నడుస్తున్నాయి. ఆర్టీసీ డిపో ముందు వామపక్ష పార్టీల కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోటారు వాహనాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. బస్సులు వెళ్లకుండా గేటు ముందు అడ్డుకోవడంతో దాదాపు 21 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. బంద్ ప్రభావంతో బస్టాండ్​లో ప్రయాణికుల సంఖ్య తగ్గింది.

ఇదీ చదవండి:తుపాను ప్రభావంతో రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..!

ABOUT THE AUTHOR

...view details