ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. ఒడ్డుకు చేరుకోలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఉప్పొంగుతున్న వాగు.. చిక్కుకుపోయిన 23 మంది కూలీలు - suryapet district latest news
ఉప్పొంగుతున్న వాగు.. చిక్కుకుపోయిన 23 మంది కూలీలు
21:14 July 22
ఉప్పొంగుతున్న వాగు.. చిక్కుకుపోయిన 23 మంది కూలీలు
వీరు తీసుకున్న స్వీయ వీడియో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కూలీలంతా మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్ల మండలం చౌళ్ల తండాకు చెందిన వారు కాగా.. వ్యవసాయ పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చినట్లు సమాచారం.
ఇవీ చూడండి..
మళ్లీ అందుకున్న వానలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశం..
Last Updated : Jul 22, 2022, 10:03 PM IST