తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన సదస్సులో పాల్గొన్న కోదండరాం

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెజస పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హాజరై పట్టభద్రులకు అవగాహన కల్పించారు.

Kodandaram participated in the mlc vote registration awareness programme at huzurnagar
ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన సదస్సులో పాల్గొన్న కోదండరాం

By

Published : Nov 1, 2020, 7:21 PM IST

ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియకు గడువు ఈనెల ఆరో తారీఖు వరకు ఉందని.. పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెజస పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్లలో తేదీలు మార్చి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఓటు నమోదు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఎమ్మెల్సీ ఓటు నమోదు అవగాహన సదస్సులో పాల్గొని.. పట్టభద్రులకు అవగాహన కల్పించారు.

పట్టభద్రులు ఎవరైనా తమ ఓటును తామే నమోదు చేసుకోవాలని, ఇతరులపై ఆధారపడొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు కోల్పోతారన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నాయని హెచ్చరించారు. ఓటు హక్కును రెండు విధాలుగా ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఓటుకు అప్లై చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: బండి సంజయ్ కోసం కార్యకర్త ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details