సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉదయపు నడక నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులతో ముచ్చటించి.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
'ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయి' - suryapet district latest news
ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
'ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయి'
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 3 రెట్లు పెరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే.. సీఎం కేసీఆర్కు ఉద్యోగ నోటిఫికేషన్లు గుర్తొచ్చాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పట్టభద్రులు తెరాసకు గుణపాఠం చెబుతారని విమర్శించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.