సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన 119 మందికి 37 లక్షల రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు.
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ నియోజకవర్గ పరిధిలో 119 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.
సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బంగారు తెలంగాణలో భాగంగా దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు అందిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కొంతమేర ఆసరాగా నిలుస్తాయన్నారు.
ఇవీ చూడండి:తొమ్మిది మంది వార్డు సభ్యులకు 'తెరాస' షోకాజ్ నోటీసులు