సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలకేంద్రంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా రాష్ట్ర మంతట జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం పాడుకొని సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో జెండాను అవనతం చేయాలి. కానీ మండలకేంద్రంలోని ఉపకార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో ఉదయం జెండాను ఎగరవేసి ఆత్రుతతో సిబ్బంది ఎవరి తోవ వారు వెళ్ళిపోయారు. సాయంత్రం జెండాను అవనతం చేయాలన్న విషయాన్ని మరిచారు.
కార్యాలయంలో డీఈ శ్రీకాంత్ సహా ఏఈ, సహాయకులు మెుత్తం ఐదుగురు సిబ్బంది ఉంటారు. అందులో స్థానికంగా ఎవ్వరూ ఉండరు . రాత్రి వేళ కాపలాదారి కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. రాత్రి అయినా జెండా అవనతం కాలేదనే విషయాన్ని తెలుసుకున్న గ్రామ యువకులు స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించగా కారోబార్ ద్వారా జెండాను అవనతం చేయడం జరిగింది .జాతీయ జెండాను అవమానపరిచిన సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం నాడే.. జాతీయ జెండాకు అవమానం - రాష్ట్ర ఆవిర్భావం నాడే.. జాతీయ జెండాకు అవమానం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడే జాతీయ జెండాకు అవమానం జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఉపకార్యనిర్వాహక ఇంజినీరు కార్యాలయంలో ఉదయం జెండా ఎగురవేసి సాయంత్రం అవనతం చేయకుండా వెళ్లారు.
జాతీయ జెండాకు అవమానం
ఇవీ చూడండి: నాటుకోడి పులుసు,అంబలి@ తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్
Last Updated : Jun 3, 2019, 8:30 AM IST