నూతన వ్యవసాయ విధానంపై రైతులకు ఉన్న అపోహలను తొలగించి మంత్రి జగదీశ్ రెడ్డి అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రవేశ పెట్టనున్న నియంత్రిత సాగు విధానంపై చర్చించేందుకు సూర్యాపేట జిల్లా అనిరెడ్డిగూడెం గ్రామ రైతులతో మంత్రి గురువారం ముఖాముఖి నిర్వహించారు. వారిని సంఘుటితం చేసేందుకు రైతులతో చర్చించారు. ఆ గ్రామ రచ్చబండ వద్ద మంత్రి రైతులను కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన సాగు విధానంపై వారితో ముచ్చటించారు. మంత్రితో రైతులు నేరుగా మాట్లాడి నియంత్రిత సాగు విధానంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
రైతు ధరను నిర్ణయించే అధికారం..
రైతుకు ధరను నిర్ణయించే అధికారం రావాలనే రాష్ట్రంలో సీఎం ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు పరుస్తున్నారని తెలిపారు. అందుకు అనుగుణంగా రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని ఆయన రైతులను కోరారు. అన్ని ఉత్పత్తులకు ధర నిర్ణయించే అధికారం తయారీదారులకు ఉండాలన్నారు. అటువంటి దుస్థితి నుంచి రైతాంగాన్ని బయట పడేయ్యాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయం అని చెప్పారు.