సూర్యాపేట జిల్లా ద్వారకుంట నుంచి జగ్గయ్యపేట మండలం అన్నారం గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న అశోక్, వీరమ్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న కారు ఆకస్మికంగా వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. వీరి బైకు మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వీరమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా..అశోక్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... ముగ్గురికి తీవ్ర గాయాలు - VEERAMMA AND ASHOK
సూర్యాపేట జిల్లాలో కారు రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు.
తీవ్ర గాయాలతో కోదాడ ఆసుపత్రికి తరలింపు