సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఉస్మానియా మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. వేడుకకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తన హయాంలో హుజూర్ నగర్ పట్టణంలోని ముస్లిం సోదరులకు పెద్దపీట వేశామని తెలిపారు.
ముస్లింలకు 50 లక్షల రూపాయలతో షాదీఖానా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్ ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
'హుజూర్నగర్లో కాంగ్రెస్ ఇఫ్తార్ విందు' - TPCC UTTHAM KUMAR
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.
ముస్లింలకు కాంగ్రెస్ హయాంలోనే రిజర్వేషన్
ఇవీ చూడండి : 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి'