తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

హుజూర్​నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 150 మంది ఎన్నికల సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. మొదట ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు.

హుజూర్​నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

By

Published : Oct 24, 2019, 8:00 AM IST

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల అధికారులు ఉ.8 గంటలకు సూర్యాపేట వ్వవసాయ మార్కెట్ గోదాం ఆవరణలో లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లు లెక్కించనున్నారు. మొదట ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌ఫర్‌ ఫర్‌ పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 150 మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత, 30-పోలీస్​ యాక్ట్​ను అమలు చేశారు. పారామిలిటరీ, స్పెషల్‌పార్టీ, ఆర్మ్‌గార్డ్స్ సహా రెండొందల మంది భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details