సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం గాంధీ నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం మొక్కలను తొలగించిన వ్యక్తికి జరిమానా విధించారు. శ్మశాన వాటిక స్థలంలో నాటిన మొక్కలను అక్రమంగా తొలగించిన అన్నపురెడ్డి వెంకట్రెడ్డి అనే రైతుకి 5,300 రూపాయల జరిమానాను పంచాయతీ కార్యదర్శి విధించారు. హరితహారం మొక్కలను ఎవరు తొలగించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హరితహారం మొక్కలను తొలగించిన రైతుకు భారీ జరిమానా - suryapet district news
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలను తొలగించిన రైతుకు భారీగా జరిమానా విధించిన సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ఆ రైతుకు ఏకంగా 5,300 రూపాయలను జరిమానాగా విధించారు.
హరితహారం మొక్కలను తొలగించిన రైతుకు భారీ జరిమానా