తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర పోరుపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి కుట్ర'

సూర్యాపేట జిల్లాలో  కాంగ్రెస్ పురపాలిక ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. తెరాస ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి కుట్ర పన్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

నామినేషన్ వేయడానికి సమయం కావాలని హైకోర్టుకు వెళ్లాం : ఉత్తమ్
నామినేషన్ వేయడానికి సమయం కావాలని హైకోర్టుకు వెళ్లాం : ఉత్తమ్

By

Published : Jan 5, 2020, 12:58 PM IST

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. తెరాస ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి పుర ఎన్నికలపై కుట్రపన్నాయని ఉత్తమ్ ఆరోపించారు.

నామినేషన్ వేయడానికి సమయం కావాలని హైకోర్టులో పిటిషన్ వేశామని ఈ సందర్భంగా తెలిపారు. నేరేడుచర్లను గతంలో అభివృద్ధి చేశామని...ఇక ముందు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్​నే గెలిపించాలని కోరారు. అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేశామని... గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు.

గెలుపు లక్ష్యంగా అభ్యర్థి ఎంపిక...

ప్రతీ వార్డులో కౌన్సిలర్​ అభ్యర్థిని ఎంపిక చేసి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఎవరైనా రెబల్ అభ్యర్థి ఉంటే బుజ్జగించాలన్నారు. తెరాస ప్రభుత్వం కమీషన్ల కోసమే పని చేస్తోందని ఎద్దేవా చేశారు. పంజాబ్, కేరళ, బీహార్, ఒడిస్సా, పశ్చిమ బంగా రాష్ట్రాలు పౌరసత్వ చట్టాన్ని అమలు చేయమని ప్రకటించాయని గుర్తు చేశారు.

నామినేషన్ వేయడానికి సమయం కావాలని హైకోర్టుకు వెళ్లాం : ఉత్తమ్

ఇవీ చూడండి : పురపోరుకు విడుదలైన ఓటర్ల తుది జాబితా ఇదే...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details