తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సారెస్పీ పెద్ద కాలువకు గండి.. వృథాగా పోయిన నీరు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరధిలోని ఎస్సారెస్పీ కాలువకు డీబీఎం 69 పరిధిలోని 4ఆర్, 6ఆర్​ల వద్ద గండి పడి నీరు వృథాగా పోయింది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి నీటి ప్రవాహాన్ని ఆపేశారు.

gandi for srsp canal in suryapeta
ఎస్సారెస్పీ పెద్ద కాలువకు గండి.. వృథాగా పోయిన నీరు

By

Published : Jul 22, 2020, 10:15 AM IST

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం పరిధిలోని ఎస్సారెస్పీ కాలువకు డీబీఎం 69 పరిధిలోని 4ఆర్, 6ఆర్ ఉపకారాల వద్ద మంగళవారం గండి పడి నీరు వృథాగా పోయింది. ఎస్సారెస్పీ అధికారులు వెంటనే స్పందించి తూము వద్ద నీటి కట్టడి చేసేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. దీని వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయింది.

తిరుమలగిరి మండలం గుండెపుడి గ్రామ సమీపంలోని తూము వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు తొలగించడం వల్లే నీటి ప్రవాహం పెరిగి కాలువకు గండి పడిందని సైట్ ఇంజినీర్ నరేష్ రెడ్డి తెలిపారు.

విషయం త్వరగా తెలియడం వల్ల తాత్కాలిక మరమ్మతులు చేయించి నీటిని వృథాగా పోకుండా కట్టడి చేయగలిగామన్నారు. అలాగే కాలువకు గండి పడేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుసకుంటామని సైట్ ఇంజినీర్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details