తెలంగాణ

telangana

ETV Bharat / state

'షరతులు లేకుండా కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలి'

మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేశారు.

field assistants protest at suryapet collector office
'షరతులు లేకుండా కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలి'

By

Published : Mar 3, 2020, 1:31 PM IST

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విధించిన 40 శాతం పనిదినాల సర్క్యూలర్ మూలంగా ఫీల్డ్ అసిస్టెంట్​లు తమ ఉనికిని కోల్పోతున్నారు. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన 47,79 జీవోలను రద్దు చేయాలని ఐకాస డిమాండ్ చేసింది.

'షరతులు లేకుండా కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలి'

పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలపై చర్చించాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టును రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో మార్చి 11న హైదరాబాదులో మహా ధర్నా చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి:అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ

ABOUT THE AUTHOR

...view details