సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు జోగిని సుందర్రావు ,కరుణ దంపతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రాన్ని క్షేత్ర పర్యటనలో భాగంగా తుంగతుర్తి డివిజన్ ఆత్మ సంస్థ కమిటీ, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. పంటను చూసిన వ్యవసాయ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వ్యవసాయ అధికారి జగ్గూ నాయక్ తెలియజేశారు. ఈ వ్యవసాయం డాక్టర్ సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానమని జోగిని సుందర్రావు తెలిపారు. ఈ వ్యవసాయంలో రసాయన ఎరువులు వినియోగించకుండా... కేవలం సేంద్రియ ఎరువులే వినియోగిస్తున్నామనన్నారు. ప్రభుత్వం రైతులను ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కోరారు.
'ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి ఎంతో మేలు'
సూర్యాపేట జిల్లా రావులపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని తుంగతుర్తి డివిజన్ ఆత్మ సంస్థ కమిటీ, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని వ్యవసాయ అధికారులు తెలిపారు.
'ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి ఎంతో మేలు'
ఇవీ చూడండి: అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు... అన్నదాతల ఆవేదన