తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎక్సైజ్​ పోలీసుల దాడులు... భారీగా సరుకు స్వాధీనం - భారీగా పట్టుబడ్డ సారాయి

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా... అక్రమార్కులు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. సూర్యాపేడ జిల్లా మఠంపల్లి మండల పరిధిలోని తండాల్లో ఆబ్కారీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీగా సరుకు పట్టుబడింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

excise police caught heavy  Adulterated alcohol
ఎక్సైజ్​ పోలీసుల దాడులు... భారీగా సరుకు స్వాధీనం

By

Published : Jul 3, 2020, 4:10 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మండల పరిధిలోని రామచంద్రాపురం, సుల్తాన్​పూర్ తండాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో భాగంగా 7 బస్తాల నల్లబెల్లం, 20 లీటర్ల సారాను ఆబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details