తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు - సూర్యాపేటలో ఈనాడు స్పోర్ట్స్​ లీగ్

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈనాడు క్రికెట్​ పోటీలు సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్నాయి. శుక్రవారం నాలుగు మ్యాచ్​లు జరగాల్సి ఉండగా.. సరైన ధ్రువపత్రాలు సమర్పించనందున నాలుగో మ్యాచ్​ను నిర్వాహకులు రద్దు చేశారు.

eenadu sports league in suryapet
సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు

By

Published : Dec 21, 2019, 10:38 AM IST

సూర్యాపేటలో హోరాహోరీగా ఈనాడు క్రికెట్​ పోటీలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఈనాడు క్రికెట్ పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొలి మ్యాచ్ టీఎస్ మోడల్ కాలేజ్ (ఆత్మకూరు) వర్సెస్ శ్రీ మేధా జూనియర్ కాలేజ్ (సూర్యాపేట) తలపడ్డాయి. ఈ పోటీలో ఆత్మకూరు టీఎస్ మోడల్ కాలేజ్ జట్టు మ్యాచ్ గెలిచింది.
రెండో ఆటలో ఆల్ఫా జూనియర్ కాలేజ్ (నల్గొండ) వర్సెస్ టీఎస్ మోడల్ కాలేజ్ (మునగాల) తలపడగా.. ఆల్ఫా జూనియర్ కాలేజ్ జట్టు విజయం సాధించింది.

మూడో మ్యాచ్ నల్గొండలోని డాన్ బాస్కో కాలేజ్ వర్సెస్ నాగార్జున సాగర్ పాలిటెక్నిక్ కాలేజ్ జట్లు తలపడ్డాయి. ఈ ఆటలో సాగర్ పాలిటెక్నిక్ కాలేజ్ జట్టును విజయం వరించింది.

నాలుగు మ్యాచ్​లో ఎస్​ఎల్​ఎన్​ఎస్​ కాలేజీ యాదగిరిగుట్ట వర్సెస్ కేఎల్​ఎన్​ జూనియర్ కాలేజీ మిర్యాలగూడ జట్లు తలపడాల్సి ఉండగా... క్రీడాకారులు సరైన ధ్రువపత్రాలు ఇవ్వనందున నిర్వాహకులు ఆటను రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

...view details