సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో కరోనా వైరస్ దెబ్బకు పౌల్ట్రీ వ్యాపారం డీలా పడింది. కోళ్లను ఎవరు కొనుగోలు చేయకపోవడం వల్ల ఏమి చేయాలో అర్థం కాక పౌల్ట్రీ వ్యాపారి నూకల సూర్య ప్రకాశ్ 4 వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
ఉచితంగా కోళ్ల పంపిణీ ఎక్కడో తెలుసా..? - ఉచితంగా కోళ్ల పంపిణీ ఎక్కడో తెలుసా..?
కరోనా దెబ్బకు పౌల్ట్రీ వ్యాపారం డీలా పడింది. చికెన్ తినేవారు తగ్గడం వల్ల కోళ్లను కొనేవారే కరువయ్యారు. ఉన్న కోళ్లను ఏం చేయాలో తెలియక సూర్యాపేట జిల్లా రామాపురంలో ఓ పౌల్ట్రీ వ్యాపారీ 4 వేల కోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు.
ఉచితంగా కోళ్ల పంపిణీ ఎక్కడో తెలుసా..?
కోళ్లు ఉచితంగా ఇస్తున్నారని తెలియగానే జనాలు ఎగబడ్డారు. కోళ్లఫాంలోకి వెళ్లి దొరికినన్నీ కోళ్లను పట్టుకెళ్లారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస
TAGGED:
suryapeta latest news