నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీరు దిగువకు వదలడం, మూసీ నదిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం, పులిచింతల జలాశయంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడం వల్ల సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని రావిపహాడ్, గుండెబోయిన గూడెం, మహంకాళిగూడెం గ్రామాల్లో వరి, పత్తి చేలు నీటమునిగాయి. రావిపహాడ్, మహంకాళిగూడెం గ్రామాలు పులిచింతల ముంపు జాబితాలో లేకున్నా ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
వరదనీటిలో మునిగిన పంటలు.. ఆవేదనలో రైతన్న.. - suryapet district news
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీటమునిగాయి. రావిపహాడ్, మహంకాళిగూడెం గ్రామస్థులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
వరదనీటిలో మునిగిన పంటలు.. ఆవేదనలో రైతన్న..