తెలంగాణ

telangana

ETV Bharat / state

పోతిరెడ్డిపాడు జీవోకు నిరసనగా సీపీఎం నాయకులు దీక్ష - ap government

హుజూర్​నగర్​లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుకు నిరసనగా సీపీఎం నాయకులు దీక్ష చేపట్టారు. ఏపీ సర్కారు 203 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

cpm leaders protest in suryapet district
పోతిరెడ్డిపాడు జీవోకు నిరసనగా సీపీఎం నాయకులు దీక్ష

By

Published : May 15, 2020, 5:55 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ మండలంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు నిరసనగా నాయకులు దీక్ష చేపట్టారు. తెరాస ప్రభుత్వం ఉదాసీనతను ఖండిస్తున్నామని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం 203 జీవోను వెంటనే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. దీనివల్ల సాగర్ ఎడమ కాలువపై ఆధారపడుతున్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెరాస సర్కారు దక్షిణ తెలంగాణపై వివక్షత చూపుతోందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం వల్ల హైదరాబాద్​కు తాగునీరు, సాగర్ ఎడమ కాలువ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.

ఇవీ చూడండి: 'పోతిరెడ్డిపాడును ఎలాగైనా అడ్డుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details