సూర్యాపేట జిల్లాలో బయటపడుతున్న వరుస పాజిటివ్ కేసులతో... అనుమానితుల కోసం అధికార యంత్రాంగం జల్లెడ పడుతోంది. ఆయా ప్రాంతాల్లో వందలాది మంది సిబ్బంది స్క్రీనింగ్ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే 11 కేసులు నమోదవడంతో... జిల్లా కేంద్రం సహా ప్రధాన పట్టణాల్లో నిఘా పెరిగింది. సూర్యాపేట పట్టణానికి చెందిన 9 మందితోపాటు... తిరుమలగిరి, నేరేడుచర్ల మండల కేంద్రాలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున కొవిడ్ బారిన పడ్డారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా బాధితుల వారి సంఖ్య 20కి చేరింది.
కరోనా కేసులు పెరగడంతో సూర్యాపేటలో నిఘా - coronavirus updates
సూర్యాపేట జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిన్న ఒక్క రోజే 11 కేసులు నమోదవడంతో... జిల్లా కేంద్రం సహా ప్రధాన పట్టణాల్లో నిఘా పెరిగింది. అనుమానితుల కోసం జల్లెడ పడుతున్నారు.
corona virus
నేరేడుచర్ల, తిరుమలగిరి మండల కేంద్రాలతోపాటు... సమీప పల్లెల్ని వైద్యారోగ్య, పోలీసు విభాగాలు జల్లెడ పడుతున్నాయి. నేరేడుచర్లలో 50, తిరుమలగిరిలో 37 బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానితుల కదలికలపై సిబ్బంది దృష్టిసారించారు. ఇప్పటికే నేరేడుచర్ల, తిరుమలగిరికి సంబంధించి... 60 మందిని క్వారంటైన్లకు తరలించారు.
ఇదీ చూడండి:లాక్డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత