సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు స్వతహాగా అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు పరీక్షల కోసం అతన్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తిరుమలగిరిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు... ఆందోళనలో స్థానికులు - corona-suspected-case-in-tirumalagiri-suryapet-district
తిరుమలగిరికి చెందిన ఓ వ్యక్తి తనలో కరోనా వ్యాధి లక్షణాలున్నాయని స్వతహాగా సమాచారం ఇవ్వగా... అప్రమత్తమైన వైద్యాధికారులు అతన్ని హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనతో తిరుమలగిరి వాసులల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
తిరుమలగిరిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు... ఆందోళనలో స్థానికులు
ఆ వ్యక్తి ముంబాయిలో తన బంధువుల వివాహానికి హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 15న హైదరాబాద్కు విమానంలో వచ్చి 16న బస్సులో తిరుమలగిరికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నాడు. అనుమానంతో ఆ వ్యక్తి స్వతహాగా అధికారులకు సమాచారం ఇవ్వగా... అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రజలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి:ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా మొదటి వార్షికోత్సవం