హుజూర్నగర్ ఉపఎన్నిక ధర్మానికి... అధర్మానికి మధ్య జరుగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. హుజూర్‌నగర్‌లో గెలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తమ్ సతీమణి పద్మావతి 30 వేల మెజారిటీతో గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఇక్కడి నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారని కాంగ్రెస్‌కి మరోసారి పట్టం కట్టడానికి సిద్ధమయ్యారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ బీసీల రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమిని ఇవ్వలేదన్నారు. రైతుబంధు ఎంత ముఖ్యమో.. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కూడా అంతే ముఖ్యమని గుర్తు చేశారు.
హుజూర్‌నగర్‌లో గెలుపు... రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు
హుజూర్నగర్ ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు అని తెలిపారు టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లురవి. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ మలుపు