తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మూడో కరోనా పాజిటివ్​ కేసు నమోదైన నేపథ్యంలో... ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి పర్యటించారు.

By

Published : Apr 9, 2020, 5:26 PM IST

collector-vinay-krishna-reddy-give-suggestions-to-officials
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించారు. అక్కడికి వెళ్లి వైద్య సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

కరోనా వైరస్​ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు బయటకు రావొద్దని... ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మరో ఆరు కేసులు నమోదయ్యాయని తెలిపారు.

ఇవీచూడండి:లాక్​డౌన్​లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...

ABOUT THE AUTHOR

...view details