ప్రజలకు, నియంతకు మధ్య జరుగుతున్న ఎన్నిక హుజూర్నగర్ ఉపపోరు అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి గెలిస్తే హస్తం పార్టీ బలం పుంజుకుంటుందని అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్ పబ్లిక్ క్లబ్ మైదానంలో ఉత్తమ్ నిర్వహించిన సభలో... భట్టి పాల్గొన్నారు. అవినీతి సొమ్ముతో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాస కొనుగోలు చేసిందన్నారు. పద్మావతిని గెలిపించి కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని కోరారు.
"హుజూర్నగర్ ఎన్నికలు.. ప్రజలు, నియంతకు మధ్య పోటీ" - batti vikramarka campaign in huzurnagar
పద్మావతి రెడ్డి గెలిస్తే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు పెరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
భట్టి విక్రమార్క