తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బోనాల సందడి - గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి

సూర్యాపేట జిల్లాకేంద్రంలోని తాళ్లగడ్డలో ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్​ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బోనాల సందడి

By

Published : Aug 25, 2019, 8:05 PM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో ప్రతిఏటా శ్రావణమాసంలో జరిగే ఇంద్రవెళ్లి ముత్యాలమ్మ వారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బోనాల సందడి

ABOUT THE AUTHOR

...view details