రాష్ట్రంలో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల నాటికి భాజపా బలోపేతం చేసి అధికారంలోకి వస్తామని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ అరాచకాలకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో భాజపా జెండా ఎగురేస్తాం: డీకే అరుణ
సూర్యాపేట జిల్లా కోదాడలో డీకే అరుణ ఆధ్వర్యంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంను నిర్వహించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఇంఛార్జీ సంకినేని వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణలో భాజపా జెండా ఎగురేస్తాం: డీకే అరుణ