తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది'

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ కుటుంబం.. రెండింతల ఆస్తి సంపాదించుకుందని భాజపా కోర్​ కమిటీ సభ్యులు వివేక్​ వెంకటస్వామి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 450 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు.

bjp-leader-vivek-venkata-swamy-campaigned-for-the-mlc-election-in-suryapet
'రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది'

By

Published : Mar 7, 2021, 10:12 AM IST

రాష్ట్రంలో కేసీఆర్​ పాలన పిచ్చి తుగ్లక్​ పరిపాలనను మించి పోయిందని రాష్ట్ర భాజపా కోర్​ కమిటీ సభ్యులు వివేక్​ వెంకటస్వామి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఇంఛార్జి రామచంద్రయ్యతో కలిసి పాల్గొన్నారు. తిరుమలగిరిలో 450 మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించిన వివేక్.. గుర్రంబోడు భూ నిర్వాసితులకు అండగా నిలిచిన భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

రాష్ట్రాన్నిరూ.60 వేల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల అప్పులపాలు చేసిన కేసీఆర్​​ కుటుంబం.. రెండింతల ఆస్తులను సంపాదించుకుందని వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగాలు కేవలం కల్వకుంట్ల కుటుంబమే తీసుకుందని విమర్శించారు. ప్రజల తరఫున పోరాడుతున్న వారందర్ని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మెడలు వంచి ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో అమలయ్యే విధంగా బండి సంజయ్ చేశారని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థికి ఓటు వేసి కేసీఆర్ పాలనకు చెంపదెబ్బలాంటి సమాధానం ఇవ్వాలని వివేక్ కోరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు టీవీ శ్యాం సుందర్ రావు, ఉపాధ్యక్షుడు బయ్యని చంద్రశేఖర్, నియోజకవర్గ ఇంఛార్జి రామచంద్రయ్య, నాయకులు దాసరి మల్లేశం, గౌరు శీను తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మూడేళ్లనుంచి ఎదురు చూపులు... సొంతింటి కోసం పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details