బోనాల పండుగకు వెళ్లిన భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన భర్తకు, భార్యకు మధ్య మాటామాటా పెరిగి భర్త సుధాకర్ భార్యపై కత్తిపీటతో దాడి చేశాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మాచనపల్లి పరధిలోని గుగులోత్తండాకు చెందిన గుగులోత్ శ్రీను కూతురు మహేశ్వరిని మోతే మండలం బల్లు తండాకు చెందిన భూక్య సుధాకర్కిచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఒక కూతురు కూడా ఉంది. కొంతకాలంగా బతుకుదెరువు కోసం తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా ఇటీవలే పెద్దమనుషులు సర్దిచెప్పి పంపారు.
భార్యపై కత్తిపీటతో దాడి చేసిన భర్త - దాడి
బోనాల పండుగకు పుట్టింటికొచ్చి భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన భర్త ఆవేశానికి గురై కత్తిపీటతో దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
భార్యపై కత్తిపీటతో దాడి చేసిన భర్త
ఆదివారం బోనాల పండుగకు గ్రామానికి వచ్చిన మహేశ్వరిని తీసుకెళ్లడానికి భర్త సుధాకర్ వచ్చాడు. భర్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. ఆవేశంలో సుధాకర్ పక్కనే ఉన్న కత్తిపీటతో మహేశ్వరిపై దాడి చేశాడు. అధికంగా రక్తస్రావం కావడంతో అత్యవసర చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు.
ఇదీ చూడండి : కృష్ణమ్మ పరవళ్లు... సాగర్‌కు పోటెత్తిన సందర్శకులు...