Munagala Ramalingeswara Temple sculptures : సూర్యాపేట జిల్లా మునగాలలోని రామలింగేశ్వర హనుమాన్ ఆలయంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇటీవల ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. మూడు వసతి గదులు నిర్మించేందుకు పునాదులు తవ్వుతుండగా.. 16 విగ్రహాలు లభ్యమయ్యాయి. దేవాలయం కాకతీయుల కాలం నాటిది కావడంతో నాటి విగ్రహాలుగా గ్రామస్థులు భావిస్తున్నారు.
దేవాలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు వసతి గదులు నిర్మించేందుకు తాడ్వాయి వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ తొగరు సీతారాములు ముందుకొచ్చారు. పునాదుల కోసం ఆదివారం గుంతలు తీస్తుండగా... 7 అడుగులు తవ్వేసరికి విగ్రహాలు బయటపడ్డాయి.