తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలకు డబ్బులు వసూలు చేస్తున్న వైద్యుడు - A doctor collecting money for corona tests in suryapet district

కరోనా పరీక్షలు చేసేందుకు ఓ ప్రభుత్వ వైద్యుడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. రూ.500 ఇస్తేనే పరీక్షలు చేస్తామని బేషరతుగా చెబుతున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారితో వాగ్వాదానికి దిగుతున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడు. ఈ విషయం వైరల్​ కావడంతో వైద్యుడి నిర్వాకంపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు.

కరోనా పరీక్షలకు డబ్బులు డిమాండ్​
కరోనా పరీక్షలకు డబ్బులు డిమాండ్​

By

Published : Apr 27, 2021, 2:33 AM IST

Updated : Apr 27, 2021, 7:04 AM IST

కరోనా పరీక్షలకు డబ్బులు డిమాండ్​

సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్ ప్రాథమిక వైద్యశాల ఇంఛార్జి వైద్యుడు క్రాంతి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పరీక్షలు చేసేందుకు రూ.500 వసూలు చేస్తున్నాడు. ఒకవేళ పాజిటివ్​గా తేలితే డబ్బులు తిరిగి ఇస్తున్నాడు. నెగెటివ్ వస్తే మాత్రం కచ్ఛితంగా రూ.500 వసూలు చేస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని ఏం చేసుకుంటారో చేసుకోండంటూ దబాయింపులకు పాల్పడుతున్నాడు.

అనంతారం గ్రామానికి చెందిన మామిడి సురేశ్​ అనే వ్యక్తి కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చాడు. డాక్టర్​ డబ్బులు వసూలు చేయడంతో ప్రశ్నించాడు. ఏం చేసుకుంటావో చేసుకోమ్మని వైద్యుడు దబాయించడంతో వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్టు చేశాడు. విషయం వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. గంటల వ్యవధిలోనే పెన్​పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని విచారించారు. కొవిడ్ పరీక్షలు చేసుకున్న వ్యక్తులకు ఫోన్​ చేసి అడగగా.. ఇద్దరు మాత్రమే సిబ్బంది తమను డబ్బులు అడిగినట్లు చెప్పారు. పరీక్షల కోసం వస్తున్న జనం రద్దీని అదుపు చేసేందుకే తాను అలా అన్నానని డాక్టర్ ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చాడు. సొంత నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడితే చర్యలు తీసుకుంటామని వైద్యుడిని హెచ్చరించారు.

ఇదీ చూడండి:కాలం చెల్లిన రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ల విక్రయం.. ఆరుగురు అరెస్ట్​

Last Updated : Apr 27, 2021, 7:04 AM IST

ABOUT THE AUTHOR

...view details