తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల వృద్ధురాలి నామినేషన్ - నామినేషన్

తమ భూమి కబ్జాకోరల్లో చిక్కుకుందని, ఎన్ని సార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదని... వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిందో కురు వృద్ధురాలు. 85 ఏళ్ల వయసులో హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది.

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల వృద్ధురాలి నామినేషన్

By

Published : Sep 30, 2019, 5:57 PM IST

సూర్యాపేట జిల్లా హూజూర్​నగర్ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల ఓ వృద్ధురాలు నామినేషన్ వేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తన నామ పత్రాన్ని అందజేసింది. చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన వెంకట రామలక్ష్మి తన భూమి కబ్జా కోరల్లో చిక్కుకుందని.. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని తెలిపింది. అందుకోసమే ఈ వయసులో నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను తీర్చాలని కోరింది.

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల వృద్ధురాలి నామినేషన్

ABOUT THE AUTHOR

...view details