సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని దుంపలపల్లి గ్రామ యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వర్షాల వల్ల దుంపలపల్లి- చెల్లాపూర్ మధ్య ఉన్న రహదారిపై వరినాట్లు వేశారు. రోడ్డు చిత్తడిగా మారి గుంతలమయమైందని అధికారులకు మొర పెట్టుకున్నా స్పందించలేదని నిరసన వ్యక్తం చేశారు. రహదారి గుండా వెళ్లి ఇప్పటివరకు చాలా మంది గాయాలపాలయ్యారని యువకులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని గ్రామస్థులు పేర్కొన్నారు.
రోడ్డుపై వరినాట్లు వేసిన యువకులు - సిద్దిపేట
సిద్దిపేట జిల్లా దుంపలపల్లిలో రోడ్డుపై వరినాట్లు వేసి యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ఇప్పటికైన రోడ్డును బాగుచేయించాలని కోరుతున్నారు.
వరినాట్లు వేసిన యువకులు