సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని తొమ్మిదో వార్డులో ఎనిమిది నెలలుగా మంచినీళ్ల ట్యాంక్ బోర్‌పంపు చెడిపోయి తాగునీరు రావడం లేదని మహిళలు నిరసన తెలిపారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన నిర్వహించారు. ఎనిమిది నెలల నుంచి వేరే వార్డులోని ఇళ్లలోకి వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటూ ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన
హుస్నాబాద్‌లోని తొమ్మిదో వార్డులో 8 నెలలుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న భాజపా పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. నీళ్ల ట్యాంక్ బోర్పంపును రెండు రోజుల్లో మరమ్మతులు చేయించకపోతే భాజపా ఆధ్వర్యంలో మహిళల తరఫున మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గతంలోనే వార్డు కౌన్సిలర్, ఏఈ, మున్సిపల్ కమిషనర్ల దృష్టికి పలుమార్లు బోరు పంపు సమస్యను తీసుకెళ్లామన్నారు. ఇప్పటికైనా త్వరగా స్పందించి వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఎవరూ లేని వారి కోసం ఆ నలుగురిగా మారింది!!