సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగురుకు చెందిన రేవతి, గణేష్ దంపతులు ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పత్తిలో కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం వల్ల వారిద్దరు పక్కనే ఉన్న చెట్టు కిందకి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎడ్లు వర్షానికి తడుస్తున్నాయని వాటిని తీసుకువచ్చేందుకు భర్త గణేశ్ వెళ్లాడు. ఇంతలోనే భారీ శబ్దంతో కూడిన పిడుగు చెట్టుపై పడడం వల్ల రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. శబ్దాన్ని విన్న భర్త చెట్టు కిందకి పరుగులు తీసేలోపే ఆమె విగతజీవై పడి ఉంది.
పిడుగుపాటుకు మహిళ మృతి
పిడుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కొలుగురులో జరిగింది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన రేవతి, గణేశ్ దంపతులు.. వర్షం రావడం వల్ల చెట్ట కింద నిల్చున్నారు. ఎడ్ల కోసం భర్త వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడి రేవతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
మృతి చెందిన రేవతి