తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్‌ దాఖలు - సిద్దిపేట జిల్లా దుబ్బాక

దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ వెళ్లి పత్రాలను సమర్పించారు.

trs candidate solipeta sujatha nomination filed in Dubbaka election
దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నామినేషన్‌ దాఖలు

By

Published : Oct 14, 2020, 12:28 PM IST

Updated : Oct 14, 2020, 3:33 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ తో కలిసి‌ వెళ్లిన ఆమె పత్రాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేశానని సుజాత అన్నారు. హరీశ్​ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి అండదండలతో దుబ్బాకను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​తో కలిసి సమర్పణ

దుబ్బాక ఉప ఎన్నికలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 10 నుంచి ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 16 వరకు గడువు ఉంది. 17న నామినేషన్లు పరిశీలించనుండగా.. 19 వరకు ఉపసంహరణకు గడువు ఉందని ఈసీ పేర్కొంది. నవంబర్‌ 3 పోలింగ్ నిర్వహించి.. నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఇదీ చూడండి :హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్‌ టెలీ కాన్ఫరెన్స్

Last Updated : Oct 14, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details