Mallanna Sagar: మల్లన్న సాగర్ ట్రయల్ రన్ ప్రారంభం - మల్లన్నసాగర్ వార్తలు
09:09 August 22
Mallanna Sagar: మల్లన్న సాగర్ ట్రయల్ రన్ ప్రారంభం
సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్‌కు ట్రయల్ రన్ ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అధికారులు మోటార్లను ప్రారంభించారు. ప్రస్తుతం మూడు మోటర్లతో ట్రయల్ రన్ కొనసాగుతోంది. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా నీటిని జలాశయంలోకి మళ్లీస్తున్నారు.
తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్‌లో 8 భారీ మోటార్లు ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు, మూడు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేస్తోన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 5 రిజర్వాయర్ల ద్వారా మల్లన్న సాగర్‌కు నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ఏడాది మల్లన్నసాగర్‌లో పది టీఎంసీల నీరు నిల్వ చేస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి:Kishan Reddy: 'సెలవే లేకుండా ప్రధాని పనిచేస్తే.. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కే రాడు'