సిద్దిపేట పట్టణంలో వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టటం వల్ల చెట్టు పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఈ దృశ్యాన్ని గమనించి హరితహారం అధికారి సామల్ల ఐలయ్యకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారి వాహన దారుడు రాకేష్‌కి రూ.9500 జరిమానా విధించారు.
మొక్కను ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు.. - చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..
హరితహారం కార్యక్రమాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. దీనిలో భాగంగా నాటిన మొక్కలను కొద్ది రోజుల క్రితం మేక తినటం వల్ల ఆ యజమానికి అధికారులు జరిమానా విధించారు. అలాగే ఇవాళ సిద్దిపేటలో హరితహారం మొక్కను టాటా సుమో వాహనం ఢీ కొట్టటం వల్ల చెట్టు పడిపోయింది. అధికారులు వాహనదారుడికి రూ.9500 జరిమానా విధించారు.
చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి వాటిని కాపాడుతున్నామని, వాటికీ ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవీచూడండి: కాళేశ్వరం నీళ్లతో... అమరవీరులకు 'జల నీరాజనం'
Last Updated : Dec 9, 2019, 2:24 PM IST