గత నెల 20న సిద్దిపేట జిల్లా చేర్యాలలోని టాటా ఇండికాష్ ఏటీఎంలో దొంగతనం జరిగింది. 5 లక్షల 11వేల 400 రూపాయల నగదు దొచుకెళ్లారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..చేర్యాల ఎస్బీఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తీరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి..హర్యానాకు చెందిన మగ్గురితో కలిసి చోరీ చేసినట్లు సీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. మిగతా ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు - cp
సిద్దిపేట జిల్లా చేర్యాలలో టాటా ఇండికాష్ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చేర్యాల ఎస్బీఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తీరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయట పడిందని సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
సీపీ జోయల్ డేవిస్
ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'