తెలంగాణలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర మూడో వారం భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
శరణు శరణు మల్లన్న.. మమ్మేలు మల్లన్న అంటూ భక్తులు చేసిన నామస్మరణతో కొమురవెల్లి ఆలయమంతా మారుమ్రోగింది. జాతర మూడో వారం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. పట్నాలు వేస్తూ.. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. శరణు మల్లన్న నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. శివసత్తుల నృత్యాలతో, ఒగ్గుడోలు చప్పుల్లతో సందడి వాతావరణం నెలకోంది. దేవాలయంలోని చెట్టు వద్ద భక్తులు పట్నాలు వేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఆపరేషన్ స్మైల్-7.. 223 మంది బాలలకు విముక్తి