సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో 6 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం 78 బ్లాకుల్లో 42 బ్లాకులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 36 బ్లాకులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 80 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 36 బ్లాకులకు జరుగుతున్న ఎన్నికలు - గజ్వేల్ నియోజకవర్గంలో 6 సహకార సంఘాలు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 36 బ్లాకులకు జరుగుతున్న ఎన్నికలు
ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు రైతులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం