సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మండలాల్లో చివరి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు హుస్నాబాద్ మండలంలో 39 , అక్కన్నపేట మండలంలో 71, కోహెడ మండలంలో 72 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్న వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటుహక్కు నియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, మహిళలు, యువకులు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. మొత్తం మూడు మండలాల్లో కలిపి 31 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా మిగిలిన 29 స్థానాలకు 108 మంది అభ్యర్థులు, 3 జడ్పీటీసీ స్థానాలకు గాను 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 85 వేల 95 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పటిష్ఠ బందోబస్తు నడుమ కొనసాగుతున్న పోలింగ్ - ZPTC
సిద్దిపేట జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
పటిష్ఠ బందోబస్తు నడుమ కొనసాగుతున్న పోలింగ్