తెలంగాణ

telangana

ETV Bharat / state

18 ప్రశ్నలతో బండి సంజయ్​కు మంత్రి హరీశ్ రావు లేఖ - harish rao letter to BJP State President Bandi sanjay

దుబ్బాకలో నైతిక విలువలు మంటగలిపేలా భాజుపా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందని విమర్శించారు. 18 ప్రశ్నలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు లేఖ రాశారు. తన లేఖకు సంజయ్ సమాధానం చెబుతారని ఆశిస్తున్నానన్నారు.

Telangana Minister harish rao letter to BJP State President Bandi sanjay
18 ప్రశ్నలతో బండి సంజయ్​కు మంత్రి హరీశ్ లేఖ

By

Published : Nov 1, 2020, 3:48 PM IST

దుబ్బాకలో ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడం వల్ల..... పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మంత్రి హరీశ్ రావు సమక్షంలో భాజపా సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి తెరాసలో చేరారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. అసత్య ప్రచారాలతో భాజపా నేతలు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల విషయంలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని... ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అడుగడుగునా అన్యాయమే...

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కి 18 ప్రశ్నలు సంధిస్తూ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పింఛన్లపై సవాలు చేస్తే ఇంతవరకూ స్పందించలేదన్నారు. 11 అంశాలతో ఛార్జిషీట్ వేస్తే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. మిషన్ భగీరథ, కాకతీయలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా... ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

తెరాసతోనే అభివృద్ధి

ప్రచారంలో భాగంగా రాయ్‌పోల్‌ పర్యటించిన మంత్రి హరీశ్‌ భాజపా, కాంగ్రెస్‌లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాసకు ఓటు వేస్తేనే దుబ్బాక అభివృద్ధి బాటలో నడుస్తుందని హరీశ్‌ పేర్కొన్నారు. భాజపా నేతలు పింఛన్లలో నిధులపై అసత్య ప్రచారం చేసుకోవడమే తప్ప... నిరూపించాలనే సవాళ్లను స్వీకరించడం లేదని విమర్శించారు. ప్రజలు ఆలోచించి సరైన పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి:కేంద్రానికి వెళ్తున్న పన్నుల్లో సగం మాత్రమే రాష్ట్రానికి వస్తున్నాయి

ABOUT THE AUTHOR

...view details